Thursday, June 24, 2010

ఋతువులు...

'వసంత' ఋతువులో ,
గున్నమామిడి చెట్టు క్రింద గోరుముద్దలు తింటూ,
గోదావరి గట్టు మీద కోయిలమ్మ పాట వింటూ...
నీ మధుర గానం అలా  ఉంటుంది అనుకుంటూ......'గ్రీష్మం' వరకు గడిపా....

'గ్రీష్మ' ఋతువు లో ,
వడగాలుల వేడి వేడి నిట్టూర్పులు వింటూ..
తాటిముంజేలు తింటూ,జడ లో మల్లెలు తురుముకుంటూ...
నీ మనసు ఇలా స్వచంగా ఉంటుంది అనుకుంటూ..............'వర్షా' కాలం వరకు ఎదురుచుసా....

'వర్ష' ఋతువు లో,
వానల్లో తడుస్తూ,ఏటిగట్టు వెంట పరిగెడుతూ,
పిల్లకాలువల్లో ఈతకొడుతూ,సెలయేరు లో ఆడుతూ,
నీ చిలిపి అల్లరి ఇలాగే ఉంటుంది అనుకుంటూ.........'శరత్' కాలం వరకు వేచా...

'శరత్' ఋతువు లో,
విరబూసిన వెన్నెల్లో ఆడుకుంటూ..
నిర్మలమైన ఆకాశాలను తేరిపారా చూస్తూ,
నీవు ఇలాగే ప్రశాంతంగా,నిష్కల్మషంగా ఉంటావనుకుంటూ......'హేమంతం' దాకా గడిపా...

'హేమంత' ఋతువు లో,
పిల్లగాలుల సన్నాయి  స్వరాలూ వింటూ,
రాలిన పూల పరిమళాల జ్ఞాపకాలు తలుచుకుంటూ,
నీ దరహాస వీచిక ఇంత హాయిగా ఉంటుంది అనుకుంటూ.......'శిశిరం' వరకు చూసా...

' శిశిర' ఋతువు లో,
నీవు ఇక రావని అనుకుంటూ,
మోడువారబోయే నా జీవితాన్ని తలుచుకుంటూ,
నీ హృదయం ఇంత ఘనీభవిన్చిందా  అని అనుకుంటూ......లోకం నుండి సెలవు తీసుకుంటుంటే...

తొలిమంచు తెరలను తొలగించుకుని.....నీవు....'చైత్రంగా' వచ్చావు..


నా మదిలో పులకల మొలకలు పోడిపించావు...
విరిబాలల తేనెల సిరులు కురిపించావు...
నీవు వచ్చావు....నన్ను వలచావు....


-ఇందు 

Friday, November 20, 2009

జగన్నాటకం

జీవితం అనే ఈ నాటకం లో అందరం పాత్రధరులం ...


మనల్ని నడిపించేవాడు ఆడించేవాడు ఆ సూత్రధారీ మాత్రమె...

మనం వేసే పాత్రల గురించి.... వాటి ప్రవర్తన గురించి....మన జీవన నాటకం లో ప్రతి అంకం గురించి చివరికి అంతిమ అంకం దాకా  కూడా తెలిసిన వాడు మనకి ఎందుకు ఇన్ని ఆలోచనలిచ్చాడు??? 

తను ఆడమన్నట్లు ఆడి తీరవలసిన్దేగా???

మరి ఎందుకు మనకి నిర్ణయాలు...ఆలోచనలు...వివేకం...బుధి....ఇవన్ని అవసరమా???

అసలు మనసెందుకు ఇచ్చాడు  దేవుడు??.....మనుషులు మనసులతో ఆడుకోడానికా లేక తనే ఆడుకోడానికా??

ఏమో .....

నాకైతే అదే అనిపిస్తోంది....ఇదంతా జగన్నాటక సూత్రధారి నవ్వుకోవడం కోసం తన వినోదం కోసం ఆడే నాటకం.

మనం అందులూ పాత్రదారులం ....మన పాత్ర మనం సక్రమంగా పోషించాలి....అంతే 


-ఇందు 

Sunday, October 18, 2009

నీ నవ్వు

విరిసిన పున్నాగం నుంచి జారిన పుప్పొడి లో  ప్రతిబింబించిన  నీ నవ్వు....నా మనసు చిలికిన చందనం లా  పరిమళిస్తుంది.....

సెలయేటి సరిగమలలో స్వరం కలిపి వినిపించిన నీ నవ్వు....అమరగాన వాహిని లా  నిరంతరం ప్రవహిస్తుంది.....

వేయి వసంతాలు విరిసిన వెన్నెల వేళలో పూసిన నీ నవ్వు....వన్నెల కుంచెతో విరించి గీసిన విచిత్ర రేఖ లా ఉంది...

మది లో వీచిన మలయమారుతం లా స్పృసించే నీ నవ్వు... మనసులో మధురానుభూతులు మేల్కొలుపుతుంది ......

కాని...

నీవు లేని ఈ వేళ...

నా ఎద లో మెరిసే నీ చిరునవ్వు....

అమృత వర్షం లా  కురిసి...నన్ను బ్రతికిస్తున్నది....


-ఇందు

Saturday, October 17, 2009

దీపావళి

కోటి కాంతుల వెలుగులు విరజిమ్మే "తారాజువ్వలు" .......

నవ్వుల పువ్వులు పూయించే "కాకర పువ్వోత్తులు ".........

ఆనందాల వెల్లువ పొంగించే  "మతాబులు ".....

తారా తోరణాలను ఇంటిముందు వాల్చే "దీపాల కాంతులు"...

వెరసి...
చెడు పై మంచి సాధించిన విజయానికి నిదర్శనం...ఈ దివ్వెల పండుగ....

సంతోషాల దీపావళి...అందరి జీవితాల్లో వెలుగులని పంచాలని ఆశిస్తూ...


-ఇందు 

Wednesday, October 14, 2009

నువ్వు వస్తే

మెరిసే తారక లా 
కురిసే చినుకులా
విరిసే పువ్వు లా
మురిసే  నవ్వు లా
మ్రోగే మువ్వలా
        వస్తే నువ్విలా 
రాదా వెన్నెలా 
       తనకై తానిలా...
ఎగసే  ఓ అల....
    కన్నుల లో కల...
          తీయని ఆశ లా
                చల్లని శ్వాసలా...
                    ఎన్నాళ్ళకో ఇలా..
                           ఎదురై నిలిచేలా....
                                 వస్తే చాలుగా .....
                                    అదే నా కోరిక....




-ఇందు     

ప్రేమ

అనంతమైన సాగరాలలో అన్వేషిస్తే దొరికే ఆణిముత్యం.."ప్రేమ"
ప్రేమ ఎక్కడ ఉంటే అక్కడ...
అమృత వర్షం కురుస్తుంది......
మధుర గానం వినిపిస్తుంది....
మలయమారుతం స్పృశిస్తుంది...
పూల పరిమళం వ్యాపిస్తుంది...
నింగిన హరివిల్లు విరుస్తుంది...
సాగరం ఉప్పొంగుతుంది...
మనస్సు రాగారంజితమౌతుంది....
హృదయం  వీణలా మ్రోగుతుంది...


అందుకే ప్రేమ....హృదయానికి హృదయానికి మధ్య జన్మ జన్మల బంధం...
చర్మ చక్షువులకు కనిపించని అలౌకికమైన అనుబంధం...
మనసులను సేద దీర్చే  సమ్మోహన సుమగంధం....


అన్నిటిని మించి....ప్రేమ....
అద్వితీయమైన "ఆనందం"


-ఇందు

Tuesday, October 13, 2009

ఎప్పటికీ

నిన్ను చుసిన క్షణం........మదిలో మెరిసిన సుందరస్వప్నం

నీవు పలికిన తోలి పలుకు.......నా హృదయం లో కురిసిన స్వాతి చినుకు.....

నీతో నడిచిన తొలి అడుగు.....నా గుండె రహదారి పై వేసిన ప్రతి అడుగు....

నీవు పిలిచిన తొలి పిలుపు ......నాలో కలిగిన మైమరపు.......

 నీవు పంచిన ఆత్మీయత......నాలో చిలికిన అభిమానం.........ఇప్పటికి నాకు గుర్తే......
కానీ ,...
నీవు లేని ఈ క్షణం....
    నేను చేస్తోన్న నిరీక్షణం....
               నీవు అందించిన స్నేహ హస్తం.....
                    ఇప్పటికీ కాదు...
                      ఎప్పటికీ నాకు గుర్తే.......


-ఇందు