Wednesday, October 14, 2009

ప్రేమ

అనంతమైన సాగరాలలో అన్వేషిస్తే దొరికే ఆణిముత్యం.."ప్రేమ"
ప్రేమ ఎక్కడ ఉంటే అక్కడ...
అమృత వర్షం కురుస్తుంది......
మధుర గానం వినిపిస్తుంది....
మలయమారుతం స్పృశిస్తుంది...
పూల పరిమళం వ్యాపిస్తుంది...
నింగిన హరివిల్లు విరుస్తుంది...
సాగరం ఉప్పొంగుతుంది...
మనస్సు రాగారంజితమౌతుంది....
హృదయం  వీణలా మ్రోగుతుంది...


అందుకే ప్రేమ....హృదయానికి హృదయానికి మధ్య జన్మ జన్మల బంధం...
చర్మ చక్షువులకు కనిపించని అలౌకికమైన అనుబంధం...
మనసులను సేద దీర్చే  సమ్మోహన సుమగంధం....


అన్నిటిని మించి....ప్రేమ....
అద్వితీయమైన "ఆనందం"


-ఇందు

2 comments:

  1. ప్రేమ మనసుకి ఆనందమే కాదు ... జీవితానికి రుచి ని కూడా ఇస్తుంది .... ప్రపంచాన్ని అందంగ చూపిస్తుంది .... తీయని రాగం వినిపిస్తుంది... కొత్త పరిమళం పరిచయం చేయిస్తుంది ....

    ReplyDelete
  2. baboooooooooy chanduuuuuuuu nuvvu kuda raseyochu kavithwam.........yeah love adds flavour to life....

    ReplyDelete