సెలయేటి సరిగమలలో స్వరం కలిపి వినిపించిన నీ నవ్వు....అమరగాన వాహిని లా నిరంతరం ప్రవహిస్తుంది.....
వేయి వసంతాలు విరిసిన వెన్నెల వేళలో పూసిన నీ నవ్వు....వన్నెల కుంచెతో విరించి గీసిన విచిత్ర రేఖ లా ఉంది...
మది లో వీచిన మలయమారుతం లా స్పృసించే నీ నవ్వు... మనసులో మధురానుభూతులు మేల్కొలుపుతుంది ......
కాని...
నీవు లేని ఈ వేళ...
నా ఎద లో మెరిసే నీ చిరునవ్వు....
అమృత వర్షం లా కురిసి...నన్ను బ్రతికిస్తున్నది....
-ఇందు
-ఇందు