Monday, October 12, 2009

నీవే

వర్షం కురిసినా 
వెన్నెల విరిసినా
చిరుగాలి వీచినా
సెలయేరు పారినా
కోయిల కూసినా
హరివిల్లు క్రిందకి వంగినా
పూవు పూసినా
నా మదిలో మెదిలే భావానివి నువ్వే 

-ఇందు 

ముందు మాట


ముత్యాల సరాలు....
అంటే.....
దండ గా కూర్చిన ముత్యాలు అని అర్ధం .....


ఇది గురజాడ అప్పారావు గారి కవిత సంకలనానికి పేరు .....


ఇలాగే నా కవితలు అనే ముత్యాలని దండ గా ఈ బ్లాగ్ లో పొందుపరుస్తున్నాను 


గురజాడ గారి అంత అందంగా రాయకపోయినా నేను చేస్తోన్న ఈ చిన్న ప్రయత్నానికి ఈ పేరె బాగుంటుందనిపించింది


ఇక నా కవితల విషయానికి వస్తే......
 సరళంగా,సౌమ్యంగా,అందరికి అర్ధమయ్యేలా,భావుకత నిండిన చిన్ని చిన్ని కవితల అక్షరమాల యే ఈ


"ముత్యాల సరాలు "


-ఇందు